Gone Prakash Rao: టీఆర్ఎస్ నేతల్లో అవినీతి పెరిగిపోయింది.. మావోయిస్టులు 10 నిమిషాల్లో చంపేసి పోతారు: గోనె ప్రకాశ్ రావు

Maoists can kill corrupted TRS leaders in 10 minutes says Gone Prakash Rao
షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో ఎంపీటీసీల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతిలో కూరుకుపోయారని ఆయన అన్నారు. అందుకే టీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు దోపిడీని ఆపేయాలని... లేకపోతే రానున్న రోజుల్లో మావోయిస్టులు వస్తారని... పది నిమిషాల్లో అందరినీ చంపేసి పోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నలు చాలా సీరియస్ గా ఉన్నారని... వారు తలచుకుంటే పది నిమిషాల్లో పని కానిచ్చేసి రాష్ట్ర బోర్డర్ దాటి వెళ్లిపోతారని అన్నారు. 

ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసని... అయినప్పటికీ ఆయన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి బావ రూ. 8 కోట్ల విలువైన ప్రాపర్టీని ఆక్రమించారని... అయితే అతనిపై చర్యలు లేవని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అరాచకాలు చూస్తుంటే తనకే వారిని చంపేయాలని అనిపిస్తోందని అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Gone Prakash Rao
KCR
TRS
Corruption
Maoists

More Telugu News