దినేశ్ కార్తీక్ వైపే మొగ్గు చూపిన సబా కరీం

Saba Karim says Dinesh Karthik is best option
  • టీ20 ప్రపంచకప్ కు దగ్గర పడుతున్న సమయం
  • దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ల మధ్య పోటీ
  • ఆరో స్థానంలో దినేశ్ వంటి హిట్టర్ ఉండటమే బెటర్ అన్న సాబా కరీం
టీ20 ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులో దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ కు బీసీసీఐ ఇద్దరికీ అవకాశం కల్పించింది. అయితే ఆడే అవకాశాన్ని మాత్రం దినేశ్ కార్తీక్ కే ఇస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

దినేశ్ కార్తీక్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపడం మంచి నిర్ణయంగా భావిస్తున్నానని సబా కరీం చెప్పారు. బ్యాటింగ్ ఆరో స్థానంలో కార్తీక్ లాంటి హిట్టర్ ఉండటం మంచిదేనని అన్నారు. రిషభ్ పంత్ ను ఆ స్థానంలో ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. ఇప్పటికే టీమిండియాకు మంచి కాంబినేషన్ దొరికిందని భావిస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
Dinesh Karthik
Rishab Panth
Saba Karim
Team India
T20 World Cup

More Telugu News