Edward Snowden: ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేసిన పుతిన్

Putin signed to grant Russian citizenship for Edward Snowden
  • అమెరికా నిఘా రహస్యాలను బట్టబయలు చేసిన స్నోడెన్
  • 2013లో సంచలనం సృష్టించిన స్నోడెన్
  • గూఢచర్య ఆరోపణలు మోపిన అమెరికా
  • ఆశ్రయం కల్పించిన రష్యా
ఎడ్వర్డ్ స్నోడెన్... అగ్రరాజ్యం అమెరికాకు కంట్లో నలుసు లాంటివాడు. గతంలో అమెరికా నిఘా ఏజెన్సీ కాంట్రాక్టర్ గా వ్యవహరించిన స్నోడెన్... కాలక్రమంలో అమెరికా రహస్య నిఘా ఆపరేషన్ల వివరాలను ప్రపంచానికి వెల్లడించి సంచలనం సృష్టించాడు. 

2013లో స్నోడెన్ వెల్లడించిన రహస్యాల్లో చాలావరకు అమెరికాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. దాంతో, అతడిపై అమెరికా ప్రభుత్వం గూఢచర్య ఆరోపణలు మోపింది. క్రిమినల్ నేర విచారణ ఎదుర్కొనేందుకు అతడు స్వదేశానికి తిరిగి రావాలని అమెరికా కోరుతోంది. 

అయితే, అమెరికా ఆగ్రహానికి గురైన 39 ఏళ్ల ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా ఆశ్రయం కల్పించింది. తాజాగా, స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేస్తూ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫైలుపై సంతకం చేశారు. ఇకపై స్నోడెన్ కు రష్యా పౌరులకు లభించే అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తాయి. దాంతో అతడిని స్వదేశానికి రప్పించడం అమెరికాకు కష్టసాధ్యం కానుంది.
Edward Snowden
Citizenship
Russia
Vladimir Putin
USA

More Telugu News