రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట కేసు.. షారూఖ్‌కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
- వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమయ్యారని కేసు
- గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన షారూఖ్ ఖాన్
- హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన పిటిషనర్
- హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీం ధర్మాసనం
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు షారూఖ్ ఖాన్ కారణమయ్యారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుబాయ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ షారూఖ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును విచారించిన కోర్టు షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, గుజరాత్ హైకోర్టు తీర్పును ఫిర్యాదుదారుడు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. నిన్న దీనిని విచారించిన జస్టిస్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది.