Taniyaa Bhatia: లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ

Team India women cricketer Taniyaa Bhatia bag was stolen in London hotel
  • ఇంగ్లండ్ పర్యటనలో తానియా భాటియాకు దిగ్భ్రాంతికర అనుభవం
  • లండన్ మారియట్ హోటల్లో బస చేసిన తానియా
  • చోరీకి గురైన బ్యాగులో నగలు, క్యాష్ కార్డులు
  • క్షమాపణలు తెలిపిన మారియట్ హోటల్ వర్గాలు
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టు వికెట్ కీపర్ తానియా భాటియాకు చేదు అనుభవం ఎదురైంది. విలువైన వస్తువులతో కూడిన ఆమె బ్యాగ్ హోటల్ గదిలో చోరీకి గురైంది. 

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా ఆడి 3-0తో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ సందర్భంగా భారత మహిళల జట్టు లండన్ లోని మారియట్ హోటల్ లో బస చేసింది. ఈ సందర్భంగా తానియా భాటియా బ్యాగ్ కనిపించకుండా పోయింది. 

ఆ బ్యాగులో నగదు, కార్డులు, వాచీలు, నగలు ఉన్నాయని తానియా భాటియా వాపోయింది. ఖరీదైన వస్తువులున్న బ్యాగ్ చోరీకి గురికావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ ఘటనతో తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది. తన గదిలోకి ఎవరో వచ్చారని, వారే తన బ్యాగ్ చోరీ చేసి ఉంటారని తానియా పేర్కొంది. 

ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భాగస్వామ్య హోటల్ లో భద్రతా వైఫల్యం విస్మయానికి గురిచేస్తోందని వెల్లడించింది. త్వరగా దర్యాప్తు జరిపి, ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తేవాలని తానియా డిమాండ్ చేసింది. 

కాగా, ఈ ఘటనపై లండన్ లోని మారియట్ హోటల్ స్పందించింది. టీమిండియా మహిళా క్రికెటర్ తానియాకు క్షమాపణలు తెలియజేసింది. ఏ తేదీల్లో తమ హోటల్ లో బస చేసిందో ఆ వివరాలను పంపిస్తే ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
Taniyaa Bhatia
Bag
Stolen
Hotel
London
England
Team India

More Telugu News