ఇది మణిరత్నం గారి 40 ఏళ్ల కల: కార్తి

23-09-2022 Fri 23:36
  • ఘనంగా జరిగిన 'పీఎస్ -1' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ కథ నవల నుంచి పుట్టిందంటూ వివరణ 
  • తెలుగులో డైలాగ్స్ చెప్పడం కష్టమైందన్న కార్తి
  • ఎన్టీఆర్ ని గుర్తుచేసుకున్నానంటూ వ్యాఖ్య 
Ponniyan Selven Movie Update
సౌత్ నుంచి మరో భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. భారీ తారాగణంతో భారీగా సందడి చేయనున్న ఆ సినిమా పేరే  'పొన్నియిన్ సెల్వన్'. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 30వ తేదీన వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 

ఈ వేడుకలో కార్తి మాట్లాడుతూ .. " ఇలాంటి ఒక పెద్ద సినిమా చేసినప్పుడే సినిమా ఎంత గొప్ప మీడియం అనే విషయం గుర్తుకొస్తోంది. మనందరినీ సినిమానే కలిపి ఉంచుతోంది. మణిరత్నం గారి 40 ఏళ్ల కల ఈ సినిమా. ఇది 'బాహుబలి'లా ఉంటుందా అని అంతా అడుగుతున్నారు. చెప్పుకోవడానికి ఈ భూమ్మీద చాలానే కథలు ఉన్నాయి. 

ఒక గొప్ప నవలని మణిరత్నంగారు ఈ సినిమాగా తీశారు. ఇంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రొమాన్స్ .. అడ్వెంచర్ .. రాజకీయపరమైన కుతంత్రాలు అన్నీ ఉన్నాయి. ఈ సినిమాకి తెలుగు డైలాగ్స్ చెప్పడం అంత తేలిక కాదు .. ఎన్టీఆర్ గారిని గుర్తుపెట్టుకుని చెప్పాను" అంటూ ముగించారు.