Vikram: ఇంతమంది హీరోలు .. హీరోయిన్లు ఉన్న సినిమా ఇదేనేమో: విక్రమ్

Ponniyan Selven Movie Update
  • హైదరాబాదులో జరిగిన 'పీఎస్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్' 
  • తన ఫేవరేట్ డైరెక్టర్ మణిరత్నం గారు అని చెప్పిన విక్రమ్ 
  • ఆ ఒక్క షాట్ అద్భుతమంటూ హర్షం 
  • రెహ్మాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ అంటూ కితాబు   
వైవిధ్యభరితమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో విక్రమ్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన తాజా చిత్రమైన 'పొన్నియిన్ సెల్వన్' తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో నటించిన విక్రమ్ ఈ వేదికపై మాట్లాడారు. 

"ఇంతవరకూ నేను చేసిన విభిన్నమైన పాత్రలను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో నేను గుర్రంపై వెళ్లే ఒక షాట్  ఉంటుంది. ఆ ఒక్క షాట్ చాలు అనుకున్నాను .. అది అంతబాగా వచ్చింది. ఈ స్టేజ్ పై చూడండి .. అందరూ హీరోలే .. అందరూ హీరోయిన్లే. ఇంతమంది కలిసి చేసిన సినిమా ఈ మధ్యకాలంలో ఇదేనేమో. 

నా డ్రీమ్ డైరెక్టర్ తో ఈ సినిమా చేయడం నాకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం. రెహ్మాన్ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా నాకు ఆయన చాలా మంచి హిట్స్ ఇచ్చారు. ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టులో చేసినందుకు చాలా గర్వంగా ఉంది .. ఇలా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.
Vikram
Aishwarya Rai
Jayam Ravi
Trisha

More Telugu News