ప్రేమలో విఫలం.. చెన్నైలో ఏపీకి చెందిన తమిళ సినీనటి ఆత్మహత్య
- ‘వైతా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీప
- ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడం వల్లేనంటూ ఆత్మహత్య లేఖ
- తిరుపతి జిల్లా ఇంద్రానగర్‌లో నేడు అంత్యక్రియలు
దీప మృతి విషయమై ఆమె సోదరుడు దినేష్ శనివారం రాత్రి కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదని, ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో ఉందని పోలీసులు తెలిపారు. దీప సొంత ఊరైన తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని ఇంద్రానగర్‌లో నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.