లిఫ్ట్ లో ఇరుక్కుని ఉపాధ్యాయిని మృతి

Teacher stuck in lift and died
  • ముంబయిలో ఘటన
  • లిఫ్ట్ ఎక్కుతుండగానే మూసుకుపోయిన డోర్లు
  • డోర్ల మధ్యలో చిక్కుకుపోయిన లేడీ టీచర్
  • తీవ్రగాయాలతో మృతి
ముంబయిలోని ఓ స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కుని ఉపాధ్యాయిని ప్రాణాలు కోల్పోయింది. మలాడ్ ప్రాంతంలోని సెయిట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. 

26 ఏళ్ల జెనెల్ ఫెర్నాండెజ్ సెయింట్ మేరీస్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న స్టాఫ్ రూంకు వెళ్లేందుకు 6వ ఫ్లోర్ లో లిఫ్ట్ కోసం వేచిచూస్తోంది. ఇంతలో లిఫ్ట్ వచ్చి ఆగగా, ఆమె అందులో ప్రవేశిస్తుండగానే డోర్లు మూసుకుపోయాయి. దాంతో ఆ రెండు డోర్ల మధ్యన ఆమె చిక్కుకుని పోగా, ఆ లిఫ్ట్ అలాగే కిందికి వెళ్లింది. 

ఇది గమనించిన స్కూల్ సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే జెనెల్ ఫెర్నాండెజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహటీన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Go Back to Shorts
Jenel Fernades
Death
Lift
School

More Telugu News