Manchu Vishnu: పది పుషప్స్​ చేస్తే తాను ఇలా ఉంటాడట.. మంచు విష్ణు​ సరదా ట్వీట్​

Manchu Vishnu funny coment with Bison picture
షార్ట్స్‌లో చూడండి
కొందరు కొంత సేపు వ్యాయామం చేయగానే తమకు ఏదో బలం వచ్చేసినట్టు, తాము దృఢంగా అయిపోయినట్టు భావిస్తుంటారు. వ్యాయామం చేయగానే తమకేదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుందని అంటారు. ఈ విషయాన్నే టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఓ సరదా ఫొటో కామెంట్ తో చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ దున్నపోతు ఫొటో పెట్టి ట్వీట్ చేశారు.

బలమైన దున్నపోతు ఫొటోతో..
 మంచు విష్ణు పెట్టిన ఫొటో మామూలుది కాదు. బాహుబలి సినిమాలో ఉండే బలమైన దున్నపోతు తరహాలో.. కండలు తిరిగిన దృఢమైన దున్నపోతు ఫొటోను మంచు విష్ణు పోస్ట్ చేశారు. దానికి సరదాగా.. ‘నేను పది పుషప్స్ చేసిన తర్వాత ఇలా ఉంటానేమోనని ఊహించుకుంటూ ఉంటాను..’ అని కామెంట్ పెట్టారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇతర హీరోల అభిమానులు ట్రోలింగ్ చేస్తుంటే.. ఆయన అభిమానులు భలేగా చెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు.

విడుదలకు సిద్ధమవుతున్న ‘జిన్నా’ సినిమా
మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమాలో నటిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా సూర్య దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇటీవలే దర్శకుడు వెల్లడించారు.

Go Back to Shorts
Manchu Vishnu
Movie news
Tollywood
Twitter

More Telugu News