మోదీకి బర్త్ డే విషెస్ చెప్పనన్న పుతిన్.. అందుకు ఆసక్తికర కారణం చెప్పిన రష్యా అధ్యక్షుడు
- మోదీ బర్త్ డే జరుపుకోబోతున్న విషయం తనకు తెలుసన్న పుతిన్
- మోదీకి ఇప్పటికిప్పుడు బర్త్ డే విషెస్ చెప్పనన్న రష్యా అధ్యక్షుడు
- తమ సంప్రదాయం ప్రకారం ముందస్తు విషెస్ చెప్పకూడదన్న పుతిన్
‘‘నేను ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. నా ప్రియ మిత్రుడు మోదీ రేపు బర్త్ డే జరుపుకుంటున్న విషయం నాకు తెలుసు. కానీ నేను ఆయనకు ఇప్పుడు విషెస్ చెప్పను. రష్యా సంప్రదాయం ప్రకారం ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పకూడదు. అందుకనే నేనిప్పుడు ఆయనకు విషెస్ చెప్పడం లేదు’’ అని అన్నారు.
ఆ తర్వాత పుతిన్ కొనసాగిస్తూ.. ‘‘ మీ బర్త్ డే విషయం నాకు తెలుసన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. భారతదేశానికి ఆల్ ద బెస్ట్. మైత్రీ దేశమైన ఇండియాకు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశం మరింత శ్రేయస్సు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, నేటితో మోదీ 72వ పడిలోకి ప్రవేశించారు.