మంత్రి జగదీశ్ రెడ్డిని బాహుబలి అన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ... వీడియో పోస్ట్ చేసి విమర్శలు గుప్పించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో భాగంగా ఎస్పీ ప్రసంగం
- మంత్రి జగదీశ్ రెడ్డికి జనంతో జేజేలు పలికించిన ఎస్పీ
- ఎస్పీకి కూడా ఎమ్మెల్సీ పదవి ఖాయమంటూ ఉత్తమ్ సెటైర్లు
యూనీఫాంలో ఉన్న ఓ పోలీసు అధికారి బహిరంగంగా ఇలా మంత్రిని కీర్తించడం సిగ్గు చేటని ఉత్తమ్ విమర్శించారు. గతంలో కేసీఆర్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారికి ఎమ్మెల్సీ పదవి దక్కినట్టే.. మంత్రి జగదీశ్ రెడ్డిని కీర్తించిన ఐపీఎస్ అధికారికి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కడం ఖాయమంటూ ఆయన సెటైర్లు సంధించారు.