చెప్పిన‌ట్టుగానే ఆటో డ్రైవ‌ర్ ఇంటికెళ్లి భోజ‌నం చేసిన కేజ్రీవాల్‌... ఫొటోలు ఇవిగో

delhi cm arvind kejriwal dines in ahmedabad auto drivers home
గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌... సోమ‌వారం అహ్మ‌దాబాద్‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ విక్రమ్ దత్తా ఇంటికి వెళ్లి ద‌త్తా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. ఈ మేర‌కు ఆప్ ఈ విందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది.

అహ్మ‌దాబాద్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఏర్పాటు చేసిన ఆటో డ్రైవ‌ర్ల‌తో స‌మావేశానికి హాజ‌రైన కేజ్రీవాల్‌ను విక్ర‌మ్ ద‌త్తా త‌న ఇంటికి భోజ‌నానికి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆహ్వానానికి అక్క‌డిక‌క్క‌డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కేజ్రీవాల్‌... ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మీ ఇంటికి వ‌స్తాన‌ని ద‌త్తాకు తెలిపారు.

ద‌త్తాకు చెప్పిన‌ట్లుగానే అత‌డి ఆటోలోనే అత‌డి ఇంటికి కేజ్రీవాల్ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ద‌త్తా కుటుంబ స‌భ్యుల‌ను ఆత్మీయంగా ప‌ల‌క‌రించిన కేజ్రీవాల్‌.. ద‌త్తా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నేల‌పై కూర్చునే భోజ‌నం చేశారు. అనంత‌రం ద‌త్తా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కేజ్రీవాల్ ఫొటోలు దిగారు.
Go Back to Shorts
AAP
Arvind Kejriwal
Gujarat
Ahmedabad
Auto Driver

More Telugu News