Arvind Kejriwal: నీ ఆటోలో మీ ఇంటికి వెళ్లి భోజనం చేద్దాం.. ఆటోడ్రైవర్​ ఆహ్వానానికి ఓకే అన్న కేజ్రీవాల్​ ​.. వీడియో ఇదిగో!

Kejriwal invited to dinner by Auto driver
షార్ట్స్‌లో చూడండి
గుజరాత్ పర్యటనలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఓ ఆటో డ్రైవర్ ను ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు. తమ ఇంటికి భోజనానికి వస్తారా? అని అడిగిన ఆటో డ్రైవర్ ను.. అతడి ఆటోలోనే వెళదామని, మరో ఇద్దరినీ వెంటబెట్టుకుని వస్తానని చెప్పారు కేజ్రీవాల్. దీనికి సంబంధించి ఆప్ వీడియో విడుదల చేయగా.. వైరల్ గా మారింది.

అహ్మదాబాద్ సమావేశంలో..
ఈ ఏడాది చివరిలో గుజరాత్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బలోపేతం కావాలన్న ఉద్దేశంతో కేజ్రీవాల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్ని రంగాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అహ్మదాబాద్‌ లో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ఎన్నికల్లో తాను గెలవడం వెనుక ఆటో డ్రైవర్ల సహకారం ఉందని.. గుజరాత్ లోనూ ఆ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మీ వీరాభిమానిని.. మా ఇంటికి రండి!
కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశంలో విక్రమ్ దత్తా అనే ఓ ఆటో డ్రైవర్ మాట్లాడారు. తాను కేజ్రీవాల్ కు వీరాభిమానిని అని చెప్పారు. పంజాబ్‌ లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోజనం చేసినట్టు సోషల్ మీడియాలో వీడియో చూశానని.. అలా తమ ఇంటికి భోజనానికి వస్తారా? అని అడిగాడు.

విక్రమ్ దత్తా విజ్ఞప్తిపై స్పందించిన కేజ్రీవాల్.. ‘‘తప్పకుండా వస్తా. నాతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా మీ ఇంటికి భోజనానికి వస్తారు. రాత్రి 8 గంటలకు నీ ఆటోలోనే మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి తీసుకెళ్తావా?’’ అని అడిగారు. కేజ్రీవాల్ అలా జవాబివ్వడంతో ఉబ్బితబ్బిబ్బయిన విక్రమ్ దత్తా.. తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Go Back to Shorts
Arvind Kejriwal
AAP
Gujarat
Auto
Auto driver
Twitter

More Telugu News