బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టిన చార్లెస్- 3
- గురువారం మరణించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్- 2
- ఆమె పెద్ద కుమారుడి హోదాలో రాజుగా బాధ్యతలు చేపట్టిన చార్లెస్- 3
- కార్యక్రమాన్ని తొలిసారిగా టీవీల్లో ప్రసారం చేసిన వైనం
ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న చార్లెస్- 3... బ్రిటన్ రాజరిక వ్యవస్థలతో అత్యంత ఎక్కువ వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టిన వారిగా రికార్డులకు ఎక్కారు. బ్రిటన్ రాజుగా చార్లెస్- 3 పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆయన వెంట సతీమణి కెమిల్లా, కుమారుడు విలియంలు ఉన్నారు. ఇదిలా ఉంటే... బ్రిటన్ రాజుగా చార్లెస్- 3 పదవీ బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. ఇలా రాజరిక మార్పు కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేయడం ఇదే తొలిసారి.