ఈ వయసులోనూ రోజుకు 14 గంటలు పనిచేస్తున్న అమితాబ్ బచ్చన్
- ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని
- కేబీసీ కార్యక్రమంలో వెల్లడించిన అమితాబ్ బచ్చన్
- తన కోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు చెప్పిన బిగ్ బీ
ఉదయం 6 గంటలకు మొదలు రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నట్టు అమితాబ్ చెప్పారు. మన ఇద్దరిదీ ఒకటే స్థితి అంటూ పోల్చి చెప్పారు. గేమ్ ముగిసిన తర్వాత తిరిగొచ్చి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నట్టు అమితాబ్ తెలిపారు. కరోనా కారణంగా అమితాబ్ ఇటీవలే చిన్న బ్రేక్ తీసుకున్నారు. తాను ఐసోలేట్ అయ్యారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ అమితాబ్ కేబీసీ కార్యక్రమం వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.