రూ.2,000కే నాయిస్ నుంచి నాజూకైన స్మార్ట్ వాచ్

Noise ColorFit Caliber Go smartwatch launched with 10 days battery life priced at Rs 1999
స్మార్ట్ వాచ్ లకు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నుంచి ఆదరణ ఉండడంతో పోటాపోటీగా కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. వేరబుల్ డివైజ్ ల తయారీలో ప్రముఖ సంస్థ అయిన నాయిస్.. కలర్ ఫిట్ క్యాలిబర్ గో పేరుతో కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. కేవలం రూ.1999కే దీన్ని తీసుకురావడం గమనార్హం. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ అంటోంది. 

మొత్తం ఐదు రంగుల్లో ఈ స్మార్ట్ వాచ్ విడుదలైంది. 50 స్పోర్ట్ మోడ్ లు, 150కు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్ లు ఇందులో ఉన్నాయి. గోనాయిస్, ఫ్లిప్ కార్ట్ పోర్టళ్లలో ఇది లభిస్తుంది. 1.69 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో గుండె రేటు, శారీరక కదలికలు, నిద్రించే తీరు, ఒత్తిడి స్థాయిని గుర్తించే సెన్సార్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి. స్మార్ట్ వాచ్ నుంచి కాల్స్ రిజెక్ట్, మ్యూట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
Go Back to Shorts
Noise
ColorFit Caliber Go
smartwatch
launched

More Telugu News