'స్వాతి ముత్యం' నుంచి సెకండ్ సింగిల్ రెడీ!

  • బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం'
  • కథానాయికగా వర్ష బొల్లమ్మ 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా విడుదల  
Swathimuthyam Movie Update

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం' సినిమా రూపొందింది. సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కొంత కాలం క్రితమే విడుదలకు ముస్తాబైంది. కానీ సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. 

ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 7వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు 'డమ్ డమ్ డమ్' అనే సాంగ్ ను సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో బెల్లంకొండ గణేశ్ జోడీగా వర్ష బొల్లమ్మ అలరించనుంది. గతంలో కొన్ని ప్రేమకథా చిత్రాలలో నటించిన అనుభవం ఆమెకి ఉంది.  ముఖ్యమైన పాత్రల్లో నరేశ్ .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. తొలి సినిమాతో గణేశ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో .. ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి. 

More Telugu News