Woman won lottery: పాత కారు నంబర్ తో లాటరీ టికెట్ కొంటే.. రూ.40 లక్షల బహుమతి వచ్చింది!

Woman win rs 40 lakh lottery using digits from her old car number plate
  • సామగ్రి కోసం ఫుడ్ స్టాప్ కు వెళ్లినప్పుడు లాటరీ టికెట్ కొన్న మహిళ
  • రూ.80 పెట్టి టికెట్ కొంటే.. ఏకంగా రూ.40 లక్షల బహుమతి తగిలిన వైనం
  • ఈ డబ్బులతో అప్పులు తీర్చి, ఇల్లు రిపేర్ చేయించుకుంటానన్న మహిళ 
ఎంత కష్టపడ్డా నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కష్టమవుతోంది, ఏ లాటరీయో తగిలి ఒక్కసారిగా డబ్బులు వస్తే బాగుండునని చాలా మందికి ఉంటుంది కూడా. కానీ లాటరీ ఎవరికి తగులుతుందో, ఏం కలిసి వస్తుందో చెప్పలేని పరిస్థితి. కానీ కొందరికి మాత్రం లక్ చాలా ఈజీగా కలిసి వచ్చి ఆశ్చర్యపరుస్తుంటుంది. అమెరికాకు చెందిన ఓ మహిళకు ఇలాగే లాటరీ ఒకటి భలే లక్కీగా పాత కారు నంబర్ తో కలిసి వచ్చింది.

లక్కు చూసుకుందామనుకుని.. 

అమెరికాకు చెందిన 43 ఏళ్ల మహిళ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంది. మేరీల్యాండ్ కు సమీపంలోని బాల్టిమోర్ లో ఓ ఫుడ్ స్టాప్ కు సామగ్రి కోసం వెళ్లినప్పుడు.. కేవలం ఒక్క డాలర్ (మన కరెన్సీలో రూ.80) పెట్టి మేరీలాండ్ స్టేట్ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసింది. ఆ సమయంలో తన పాత కారు నంబర్ కు అనుగుణంగా.. ఐదు నంబర్లతో కూడిన టికెట్ ను తీసుకుంది.

విచిత్రంగా.. ఆ తర్వాత తీసిన డ్రాలో సదరు మహిళ కొనుగోలు చేసిన టికెట్ కు ఏకంగా రూ.50 వేల డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.40 లక్షలు) బహుమతి తగిలింది. నిజానికి తాను కొనుగోలు చేసిన టికెట్ కు అంత పెద్ద బహుమతి తగులుతుందన్న నమ్మకం లేదని.. ఒకటికి రెండు సార్లు నంబర్ ను సరిచూసుకున్నా.. మరోసారి తన తల్లికి ఇచ్చి చెక్ చేయించానని ఆ మహిళ వెల్లడించింది. ఆమె తల్లి కూడా రెండు సార్లు చెక్ చేసి 50 వేల డాలర్ల బహుమతి తగిలిందని చెప్పడంతో నమ్మానని పేర్కొంది.

ఇక ఈ లాటరీ డబ్బులతో తన అప్పులు తీర్చుకుని, ఇంటికి మరమ్మతులు చేయించుకుంటానని.. కొత్త కారు కొనుక్కుని, పిల్లలకు బహుమతులూ ఇస్తానని ఆమె చెప్పింది. ఇంతకుముందు కూడా ఇలాగే ఓ మహిళ తన సోదరి కలలో కనిపించిన నంబర్లతో లాటరీ టికెట్ తీసుకుని 20 లక్షలు బహుమతి గెలుచుకున్న ఘటన కూడా వైరల్ గా మారింది. 
Woman won lottery
Lottery
USA
Maryland Lottery
Offbeat
International

More Telugu News