తన తాత గారితో కలిసున్న మరో అరుదైన ఫొటో పంచుకున్న కేటీఆర్
- ఇటీవల తన తాతయ్య కేశవరావు ఫొటోలు పంచుకున్న కేటీఆర్
- అందులో పిల్లవాడిగా ఉన్న కేటీఆర్
- తాజాగా పంచుకున్న ఫొటోలో కుర్ర కేటీఆర్ దర్శనం
- తనంటే తాత గారికి ఎంతో వాత్సల్యం అని వెల్లడి
కాగా, కేటీఆర్ ఇటీవల పంచుకున్న ఫొటోలపై తెలంగాణ బీజేపీ 'మెదడుకు మేత' అంటూ స్పందించింది. తన తాతయ్య కేశవరావు గురించి కేటీఆర్ చెప్పిందంతా నిజమే అయితే ఆయనకు తాము సెల్యూట్ చేస్తున్నామని పేర్కొంది. "అయితే, నిజాంలకు వ్యతిరేకంగా ఆయన పోరాడాడని చెప్పడానికి మీకందరికీ ఇన్నాళ్ల సమయం ఎందుకు పట్టిందన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, ఇన్నాళ్లుగా ఆయనను కల్వకుంట్ల కుటుంబం ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోయింది?" అంటూ తెలంగాణ బీజేపీ ప్రశ్నించింది.