నేడు మరోసారి పాక్ తో భారత్ ఢీ.. ఈసారి గెలుపు అంత ఈజీ కాదు!
- ఆసియా కప్ లో ఇరు జట్ల మధ్య సూపర్- 4 పోరు నేడు
- వరుసగా రెండు విజయాలతో సూపర్- 4కి వచ్చిన భారత్
- హాంకాంగ్ పై రికార్డు విక్టరీతో జోరుమీదున్న పాకిస్థాన్
ఈ నేపథ్యంలో ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది. హాంకాంగ్‌పై అర్ధ సెంచరీతో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకం. కానీ, అతను వేగంగా ఆడాల్సిన అవసరం ఉంది. గత పోరులో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్‌పై ఈ సారి కూడా భారీ అంచనాలున్నాయి. గాయపడ్డ జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ కు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా, బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్ నుంచి పోటీ ఉంది. బౌలింగ్‌లో పేస్ లీడర్ భువనేశ్వర్‌తో పాటు హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కానీ, యువ బౌలర్లు అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ నిరాశ పరుస్తున్నారు. అవేశ్ ఖాన్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని కోచ్ ద్రవిడ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడిని తప్పించి అదనపు బ్యాటర్ లేదా స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న పాకిస్థాన్ గత పోరులో హాంకాంగ్ పై 155 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంది. ఓపెనర్ రిజ్వాన్ ఫామ్ కొనసాగించగా.. ఫఖర్ జమాన్, కుష్దిల్ షా కూడా ఫామ్ లోకి రావడంతో టీమ్ బ్యాటింగ్ బలం పెరిగింది. ఈ పోరులో తొలి పది ఓవర్లలో ఎక్కువ రన్స్ చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇక, బౌలింగ్‌లో ఆ జట్టుకు తిరుగులేదు. స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది ప్లేస్‌లో వచ్చిన 19 ఏళ్ల నసీమ్ షా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని నుంచి భారత బ్యాటర్లకు మరోసారి ముప్పు తప్పకపోవచ్చు. స్పిన్నర్లు మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ కూడా సత్తా చాటుతున్న నేపథ్యంలో భారత్ ఏచిన్న తప్పిదం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.