మా కుటుంబంలో ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి ఇడుగో... ఆసక్తికర ఫొటోలను పంచుకున్న మంత్రి కేటీఆర్

KTR shares his maternal grand father photo
  • ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్
  • తాతయ్య కేశవరావును పరిచేయం చేసిన వైనం
  • నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడని వెల్లడి
  • స్వాతంత్ర్య సమరయోధుడిగా కేంద్రం గుర్తించిందని వివరణ
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫొటోలను పంచుకున్నారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని అందరికీ పరిచయం చేశారు. ఆ ఫొటోలో ఉన్నది తన తాతయ్య (తల్లి తరఫు) జె.కేశవరావు గారు అని వెల్లడించారు. వాటిలో ఒక ఫొటోలో చిన్నప్పటి కేటీఆర్ ను కూడా చూడొచ్చు. ఆ ఫొటోలపై వివరణ ఇస్తూ... తమ కుటుంబంలో ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి అని కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీజీ బోధనలతో ఉత్తేజం పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని కేటీఆర్ వెల్లడించారు. ఆయనకు భారత కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపునిచ్చిందని వివరించారు.
Go Back to Shorts
KTR
Grand Father
J.Keshava Rao
Photo
Nizam
Freedom Fighter

More Telugu News