Hyderabad: మాదాపూర్‌లో బీభత్సం సృష్టించిన కారు.. మద్యం మత్తులోనే ప్రమాదం!

dreaded accident in Hyderabad madhapur
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ కారు గత అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కారులో చిక్కుకుపోయిన ఇద్దరు యువతీయువకులను బయటకు లాగారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, బాధితుల  వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. కారును గుర్తుపట్టకుండా నంబరు ప్లేటును తొలగించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Madhapur
Road Accident

More Telugu News