ఆప్ పంజాబ్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను చాచిపెట్టి కొట్టిన భర్త.. వీడియో ఇదిగో
- ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌కు, భర్తకు మధ్య వాగ్వివాదం
- ఆగ్రహంతో భార్యపై దాడిచేసిన భర్త
- సుమోటోగా స్వీకరిస్తామన్న మహిళా కమిషన్
- ప్రజా సమస్యలపై గళమెత్తే మహిళ ఇంట్లో వేధింపులకు గురికావడం బాధాకరమన్న చైర్ పర్సన్
ఆ వీడియో ప్రకారం.. భార్యతో వాదులాడుతున్న ఎమ్మెల్యే భర్తను కొందరు పట్టుకుని దూరంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేకు, కొంతమంది పురుషులకు మధ్య ఆమె ఇంటి వరండాలో వాగ్వివాదం జరుగుతోంది. అదే సమయంలో మెట్లపై కూర్చున్న ఆయన వద్దకు వచ్చిన బల్జిందర్ కౌర్ మళ్లీ వాగ్వివాదానికి దిగడంతో భర్త ఆమెపై దాడికి దిగాడు. చెంపపై బలంగా కొట్టాడు.
ఈ వైరల్ వీడియో పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి దృష్టిలో పడింది. దీనిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే ఓ మహిళ ఇంట్లో వేధింపులకు గురికావడం బాధాకరమని అన్నారు.