తెలంగాణలో కనిష్ఠ స్థాయికి కరోనా రోజువారీ కేసులు... వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 14,320 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 80 కొత్త కేసులు
- వెయిటింగ్ లో 601 ఫలితాలు
- కరోనా నుంచి కోలుకున్న 345 మంది
- ఇంకా 1,924 మందికి చికిత్స
అదే సమయంలో 345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,34,143 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,28,108 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,924 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
