Asia Cuo: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బెస్ట్ విషెస్ చెప్పిన ప్రియాంకా గాంధీ

priyanka says best of luck to team india ahead pf the matcj with pakistan in asia cup tomorrow
  • శ‌నివార‌మే మొద‌లైన ఆసియా క‌ప్ 
  • రేపు భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య మ్యాచ్‌
  • టీమిండియాకు ఓ రోజు ముందుగానే బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పిన ప్రియాంక
  • విజ‌యంతో తిరిగి రావాల‌ని ఆకాంక్ష‌
క్రికెట్ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ శ‌నివారం ప్రారంభమైపోయింది. ఈ సిరీస్‌లో భాగంగా చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు, దాయాదీ దేశాలు భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య రేపు (ఆదివారం) కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ రెండు దేశాల మ‌ధ్య ఎప్పుడు మ్యాచ్ జ‌రిగినా... ఈ రెండు దేశాల క్రికెట్ అభిమానుల‌తో పాటు యావ‌త్తు ప్ర‌పంచం ఈ మ్యాచ్‌ను వీక్షిస్తుంది. వెర‌సి రేప‌టి మ్యాచ్‌పై కూడా అదే త‌ర‌హా ఉత్సుక‌త నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత‌, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ మ్మాచ్‌కు ఓ రోజు ముందుగానే టీమిండియాకు బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పారు. భార‌త జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలుపుతూ ఆమె ఓ వీడియోను విడుద‌ల చేశారు. చాలా ఏళ్ల క్రితం ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు తాను పాక్ వెళ్లాన‌ని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను చూసిన ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టే విజ‌యం సాధించింద‌ని చెప్పారు. అంతేకాకుండా తాను వీక్షించిన ప్ర‌తి సారి పాక్‌పై టీమిండియానే విజ‌యం సాధిస్తుంద‌ని కూడా ప్రియాంక చెప్పారు.

పార్టీల‌కు అతీతంగా పాక్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో యావత్తు దేశం టీమిండియాకు మ‌ద్ద‌తు తెలుపుతోంద‌ని ప్రియాంక తెలిపారు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకే పార్టీ అయినా కూడా టీమిండియా విజ‌యాన్నే కోరుకుంటాయ‌ని ఆమె తెలిపారు. పాక్‌తో మ్యాచ్‌కు విజ‌య కాంక్ష‌తోనే వెళ్లండ‌ని, విజ‌యం సాధించి రావాల‌ని ఆమె టీమిండియా జ‌ట్టు స‌భ్యుల‌కు బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పారు.
Asia Cuo
Team India
Pakistan
Cricket
Priyanka Gandhi
Congress

More Telugu News