BJP: జేపీ న‌డ్డాతో మాజీ ఎంపీ కొత్తప‌ల్లి గీత భేటీ... ఫొటో ఇదిగో

ysrcp ex mp kottapalli geetha meets jp nadda in hyderabad
  • నోవాటెల్‌కు భ‌ర్త‌తో క‌లిసి వ‌చ్చిన గీత‌
  • గీత‌ను జేపీ న‌డ్డా వ‌ద్ద‌కు తీసుకెళ్లిన ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌
  • బీజేపీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్న మాజీ ఎంపీ
2014 ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున అర‌కు లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన కొత్తప‌ల్లి గీత శనివారం హైద‌రాబాద్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. శంషాబాద్ ప‌రిధిలోని నోవాటెల్ హోట‌ల్‌కు వ‌చ్చిన గీత‌... తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో భేటీ అయ్యారు. భర్తతో కలిసి వ‌చ్చిన ఆమెను బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్ స్వ‌యంగా జేపీ న‌డ్డా వ‌ద్ద‌కు తీసుకెళ్లారు.

ఆర్డీఓ పోస్టుకు రాజీనామా చేసి మ‌రీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గీత... తొలిసారి ఎంపీగా గెలిచిన కొన్నాళ్ల‌కే పార్టీ ఫిరాయించేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఏ పార్టీలో కూడా ఇమ‌డ‌లేక‌పోయిన గీత చాలా కాలంగా అలా కామ్‌గా ఉండిపోయారు. ఒకానొక ద‌శ‌లో ప్ర‌త్యేకంగా పార్టీ పెడ‌దామ‌ని త‌ల‌చిన ఆమె భూ వివాదాలు చుట్టుముట్ట‌డంతో ఆ య‌త్నాల‌ను విర‌మించుకున్నారు. తాజాగా బీజేపీ వైపు చూస్తున్న గీత‌... వ‌చ్చే ఎన్నికల నాటికి కాషాయ పార్టీలో చేరేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్లుగా స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆమె జేపీ న‌డ్డాతో భేటీ అయిన‌ట్లు స‌మాచారం.
BJP
YSRCP
Araku
Kottapalli Geetha
K Laxman
JP Nadda
Hyderabad

More Telugu News