Chandrababu: తప్పు చేసిన పోలీసు అధికారులకు శిక్ష పడేవరకు వదిలేది లేదు: చంద్రబాబు

Chandrababu warns police
  • టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారన్న చంద్రబాబు
  • పోలీసుల మద్దతుతోనే దాడులు జరిగాయని ఆరోపణ
  • డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్
కుప్పం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అన్న క్యాంటీన్ పైనా, టీడీపీ నేతలపైనా దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను వదిలిపెట్టి, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం ఏం న్యాయమని ప్రశ్నించారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, తప్పు చేసిన పోలీసులను శిక్ష పడే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. తన కుప్పం పర్యటనలో అనేకమందిపై అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలపై దాడులు జరిగితే, తిరిగి వారిపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం పట్ల డీజీపీ ఏంచెబుతారని నిలదీశారు.
Chandrababu
Police
TDP
Workers
Kuppam
Andhra Pradesh

More Telugu News