తెలంగాణలో గత 24 గంటల్లో 298 కరోనా పాజిటివ్ కేసులు
- తాజాగా 21,489 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 130 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 435 మంది
- ఇంకా 2,416 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,33,231 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 8,26,704 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,416 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
