Team India: ఆసియా క‌ప్ కోసం దుబాయి చేరిన టీమిండియా... పాక్ కెప్టెన్ బాబ‌ర్‌తో కోహ్లీ షేక్ హ్యాండ్‌

  • జింబాబ్వే టూర్ ముగించుకుని దుబాయి చేరిన టీమిండియా
  • జ‌ట్టుతో క‌లిసిన విరాట్ కోహ్లీ
  • వైర‌ల్‌గా మారిన బాబ‌ర్‌తో కోహ్లీ షేక్ హ్యాండ్ ఫొటో
virat kohli shakes hand with babar azam at dubai

భార‌త క్రికెట్ జ‌ట్టు విరామం లేకుండా విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో కొన‌సాగుతోంది. ఇంగ్లండ్ టూర్‌తో మొద‌లుపెట్టిన టీమిండియా ఆ త‌ర్వాత వెస్టిండీస్‌, త‌ద‌నంత‌రం జింబాబ్వే టూర్ల‌ను ముగించుకుని తాజాగా ఆసియా క‌ప్ కోసం బుధ‌వారం దుబాయి చేరింది. ఈ సిరీస్‌లో భాగంగా దాయాదీ దేశాలైన భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య కూడా మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ తాజాగా ఆసియా క‌ప్ కోసం జ‌ట్టు స‌భ్యుల‌తో క‌లిసి దుబాయి చేరాడు. ఈ సంద‌ర్భంగా అత‌డు స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో ఉల్లాసంగా క‌నిపించాడు. అంతేకాకుండా పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్‌తో షేక్ హ్యాండ్ ఇస్తూ క‌నిపించాడు. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

More Telugu News