తెలంగాణలో తాజాగా 338 మందికి కరోనా
- గత 24 గంటల్లో 24,113 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 135 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 507 మంది
- ఇంకా 2,553 మందికి చికిత్స
అదే సమయంలో, 507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 8,32,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,26,269 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,553 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
