YSRCP: ఉపరాష్ట్రపతిని క‌లిసిన‌ ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు... ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియోపై ఫిర్యాదు

ap dignity for wemen complaints vice president over mp gorantla madhav video
  • ఢిల్లీలో ఏపీ డిగ్నిటీ ఫ‌ర్ ఉమెన్ నేత‌లు
  • గోరంట్ల మాధ‌వ్ వీడియోపై ప్ర‌ముఖుల‌కు ఫిర్యాదులు
  • ఏపీలో మ‌హిళ‌ల‌పై జరుగుతున్న అరాచకాలపై ఉప‌రాష్ట్రప‌తికి ఫిర్యాదు
ఓ మహిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై ఇంకా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స‌మాజం సిగ్గుప‌డేలా వ్య‌వ‌హ‌రించిన ఎంపీపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఏపీ డిగ్నిటీ ఫ‌ర్ ఉమెన్ నేతలు ఇప్ప‌టికే ఢిల్లీ చేరిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో ప‌లువురు ప్ర‌ముఖుల‌ను క‌లుస్తూ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వహారంపై ఫిర్యాదులు చేస్తున్నారు. 

ఇందులో భాగంగా బుధ‌వారం ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న‌క‌డ్‌ను ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో వ్య‌వ‌హారాన్ని ఉప‌రాష్ట్రప‌తికి వివ‌రించిన నేత‌లు... ఏపీలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాల‌పై కూడా ఉప‌రాష్ట్రప‌తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివరాల‌ను టీడీపీ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
YSRCP
Gorantla Madhav
TDP
Vice President
Ap Dignity For Women

More Telugu News