Raja Singh: రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించండి: స్పీకర్ కు ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి లేఖ

MIM MLA writes letter to Assembly speaker to suspend Raja Singh
  • ప్రకంపనలు సృష్టించిన రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో
  • ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకంగా రాజాసింగ్ మాట్లాడారన్న పాషా ఖాద్రి
  • రాజాసింగ్ పై చర్యలకు వీలుగా ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని విన్నపం
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి లేఖ రాశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకంగా రాజాసింగ్ మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించడమే కాక, ఆయనపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రొసీడింగ్స్ ను ప్రారంభించాలని కోరారు. 

ఈ నెల 20న మునావర్ ఫరూఖీ కామెడీ షో హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ షోకు పోలీసులు అనుమతి ఇవ్వడంపై రాజాసింగ్ మండిపడ్డారు. మునావర్ షోను అడ్డుకుంటామని హెచ్చరించారు. షోకు పోలీసులు అనుమతించడంపై విమర్శలు గుప్పించారు. అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఓల్డ్ సిటీలో ప్రకంపనలు పుట్టించింది. మరోవైపు రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Raja Singh
BJP
Pasha Khadri
MIM

More Telugu News