'రంగ రంగ వైభవంగా' నుంచి ట్రైలర్ రిలీజ్!
- ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'
- వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- సెప్టెంబర్ 2వ తేదీన సినిమా విడుదల
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో వైష్ణవ్ జోడీగా కేతిక శర్మ అందాల సందడి చేయనుంది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఫ్యామిలీ నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇది. హీరో హీరోయిన్ ఒకటి కావాలనే అందరూ కోరుకుంటూ ఉంటారు. సహజంగానే వాళ్లిద్దరి మధ్య గిల్లికజ్జాలు నడుస్తుంటాయి. ఆ అలకలు .. బుజ్జగింపుల మధ్య కొంత యాక్షన్ .. కొంత ఎమోషన్ ఉన్నట్టుగా ఈ ట్రైలర్ లో చూపించారు. చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే కనిపిస్తోంది.