Kalyanram: జీ 5 చేతికి 'బింబిసార' స్ట్రీమింగ్ హక్కులు!

  • ఈ నెల 5వ తేదీన విడుదలైన 'బింబిసార'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • కల్యాణ్ రామ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్
  • త్వరలో 'జీ 5' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానున్న సినిమా 
Bimbisara movie update

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'బింబిసార' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అదే రోజున వచ్చిన 'సీతా రామం' .. ఆ తరువాత వచ్చిన 'కార్తికేయ 2' పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడటం విశేషం. 

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5' వారు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. కొత్తగా పెట్టుకున్న నిబంధనల ప్రకారం 50 రోజుల తరువాత ఈ సినిమా 'జీ 5' ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఈ కథ రెండు వేర్వేరు కాలాల్లో జరుగుతుంది. రెండు కాలాల్లో ఒక నిధిని ఒకే సమయంలో తెరవడానికి జరిగే ప్రయత్నమే ఈ సినిమాకి హైలైట్. పాటల పరంగా ఈ సినిమా కాస్త వీక్ అయినప్పటికీ, కథాకథనాల పరంగా .. విజువల్స్ పరంగా లాక్కొచ్చేసింది. త్వరలోనే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

More Telugu News