భాగ్య నగరి చేరిన అమిత్ షా... మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర హోం మంత్రి
- బేగంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండైన అమిత్ షా
- స్వాగతం పలికిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్
- మరికాసేపట్లో మునుగోడు బయలుదేరనున్న బీజేపీ అగ్ర నేత
మునుగోడులో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ సభలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ సభ కోసమే అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు.