రేపే మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ... పోస్టర్ ఇదిగో
- రేపు మునుగోడు మండల కేంద్రంలో సభ
- మధ్యాహ్నం 2 గంలకు సభ మొదలు
- అభ్యర్థిని ప్రకటించనున్న కేసీఆర్
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ ఇప్పటికే సూత్రప్రాయంగా ఖరారు చేసింది. ఈ విషయాన్ని రేపటి మునుగోడు సభలో సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ క్రమంలో రేపు మునుగోడు మండల కేంద్రంలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను టీఆర్ఎస్ శుక్రవారం ఆవిష్కరించింది. ఈ సభకు ప్రజా దీవెన సభ అనే పేరు పెట్టింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. అదే సమయంలో పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు.