Kalyanram: బాలీవుడ్ కి వెళుతున్న 'బింబిసార'

  • ఈ నెల 5న థియేటర్స్ కి వచ్చిన 'బింబిసార'
  • తొలిరోజునే దక్కిన హిట్ టాక్ 
  • భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా
  • హిందీ వెర్షన్ ను రెడీ చేస్తున్న టీమ్
Bimbisara movie update

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా .. ఆయన సొంత బ్యానర్లో 'బింబిసార' నిర్మితమైంది. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. కల్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మూడు డిఫరెంట్ లుక్స్ తో కల్యాణ్ రామ్ కనిపించగా, ఆయన సరసన నాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ అలరించారు.

ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో తాము ఆశించే స్థాయిలో రెస్పాన్స్ వస్తే, అప్పుడు మిగతా భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన ఉందని ప్రమోషన్స్ సమయంలో కల్యాణ్ రామ్ చెప్పాడు. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలను సొంతం చేసుకుంది.

దాంతో ఆయన ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. హిందీలో 'కార్తికేయ  2' భారీ వసూళ్లను రాబడుతూ ఉండటంతో , 'బింబిసార'ను కూడా ముందుగా హిందీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఆల్రెడీ మొదలయ్యాయని చెబుతున్నారు.

More Telugu News