శామ్ సంగ్, గూగుల్ ఫోన్లకు త్వరలోనే ఆండ్రాయిడ్ 13 రోలవుట్
- అధికారికంగా ప్రారంభించిన గూగుల్
- ఈ ఏడాది చివర్లో మిగిలిన కంపెనీల ఫోన్లకు అందుబాటులోకి
- నూతన ఓఎస్ లో పలు కొత్త ఫీచర్లకు చోటు
కొత్త ఓఎస్ లో కొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఫోన్లలో యాప్ ల వారీగా లాంగ్వేజ్ లను నిర్ణయించుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం ఫోన్ కు ఒకటే లాంగ్వేజ్ ఉండేది. కస్టమైజ్డ్ బెడ్ టైమ్ మోడ్ కూడా ఉంటుంది. ఎంపిక చేసిన సమయంలో ఫోన్ వాల్ పేపర్ డిమ్ గా, డార్క్ గా మారిపోతుంది. ఒక యాప్ పని చేయడానికి వీలుగా మొత్తం ఫోన్ లైబ్రరీ కాకుండా ఎంపిక చేసిన ఫొటోల వరకే యాక్సెస్ ఇవ్వొచ్చు. ఈ ఫీచర్ యాపిల్ ఐవోఎస్ 14 నుంచే అందుబాటులో ఉంది.