భారత్ ఆందోళనలను బేఖాతరు చేస్తూ చైనా నౌకకు అనుమతి ఇచ్చిన శ్రీలంక
- హంబన్ టోట పోర్టుకు వస్తున్న చైనా నౌక
- అది నిఘా నౌక అని భారత్ ఆందోళన
- అనుమతి ఇవ్వొద్దని శ్రీలంకకు విజ్ఞప్తి
- భారత్ సరైన కారణాలు చెప్పడంలో విఫలమైందన్న శ్రీలంక
దీనిపై శ్రీలంక ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్ తన ఆందోళనలను ప్రధాని రణిల్ విక్రమసింఘేకు తెలియజేసిందని, అయితే, ఆ నౌకను ఎందుకు అనుమతించకూడదో సరైన కారణాలు చెప్పడంలో భారత్ విఫలమైందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 16 నాటికి యువాన్ వాంగ్-5 నౌక హంబన్ టోట పోర్టుకు రానున్నట్టు చైనా దౌత్యకార్యాలయం నుంచి సమాచారం అందిందని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.