రెస్టారెంటులో తప్పతాగి చిందులేసిన ఎయిర్ హోస్టెస్ అరెస్ట్... వీడియో ఇదిగో!

13-08-2022 Sat 16:01
  • రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘటన
  • మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్ వీరంగం
  • బీరు సీసాతో కారు అద్దం పగలగొట్టిన వైనం
Air Hostess arrested after brawl at restaurant in Jodhpur
రాజస్థాన్ లో ఓ ఎయిర్ హోస్టెస్ భర్త, స్నేహితులతో కలిసి తప్పతాగి ఓ కుటుంబంపై వీరంగం వేసింది. ఈ ఘటన జోథ్ పూర్ లో జరిగింది. రెస్టారెంటుకు వచ్చిన ప్రాచీ సింగ్ అనే ఎయిర్ హోస్టెస్ మద్యం మత్తులో ఓ కుటుంబంతో గొడవ పెట్టుకుంది. రెస్టారెంటు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వాగ్వాదం జరిగింది. దాంతో ప్రాచీ సింగ్ బీరు సీసాతో ఆ కుటుంబానికి చెందిన కారు అద్దాన్ని పగులగొట్టింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాచీ సింగ్, ఆమె భర్త కార్తీక్ చౌదరి, వికాస్ ఖండేల్వాల్, నేహాలను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. అటు, బాధిత కుటుంబానికి చెందిన విశాల్ దూబే, ఆర్యలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి బెయిల్ మంజూరైంది.