ఖజురహో వీధుల్లో బుల్లెట్ బండిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... ఫొటోలు ఇవిగో
- మధ్యప్రదేశ్ పర్యటనలో కిషన్ రెడ్డి
- తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వైనం
- బుల్లెట్ ఎక్కి ఖజురహో వీధుల్లో సంచరించిన మంత్రి
అంతేకాకుండా హర్ ఘర్ తిరంగాలో బాగంగా శనివారం దేశవ్యాప్తంగా తిరంగా బైక్ ర్యాలీకి కూడా కేంద్రం పిలుపునిచ్చింది. ఈ తిరంగా బైక్ ర్యాలీలో పాలుపంచుకునే నిమిత్తం మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి... ఆ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఖజురహో వెళ్లారు. చారిత్రక పట్టణంలో బీజేపీ శ్రేణులు, స్థానిక ప్రజలతో కలిసి ఆయన బైక్ ర్యాలీలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ బండి ఎక్కి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.