Telangana: పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫొటో, వీడియో ఇదిగో

ts minister srinivas goud fires in air with police slr weapon
  • మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో జ‌రిగిన ఫ్రీడ‌మ్ ర్యాలీ
  • ర్యాలీలో ఉత్సాహంగా పాలుపంచుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌
  • పోలీసుల ఎస్ఎల్ఆర్‌తో గాల్లోకి కాల్పులు
  • మంత్రి చ‌ర్య‌ను విమ‌ర్శిస్తూ పోస్టులు పెడుతున్న నెటిజ‌న్లు
తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శ‌నివారం ఓ వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని త‌న చేతుల్లోకి తీసుకున్న ఆయ‌న జ‌నమంతా చూస్తుండ‌గానే గాల్లోకి కాల్పులు జ‌రిపారు. మంత్రి గాల్లోకి కాల్పులు జ‌రుపుతున్న స‌మ‌యంలో పోలీసు ఉన్న‌తాధికారులు అక్క‌డే ఉన్నా... ఆయ‌న‌ను వారించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అనంతరం ఆ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. 

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా భార‌త స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల పేరిట తెలంగాణ స‌ర్కారు పలు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా శ‌నివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడ‌మ్ ర్యాలీలు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలో త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో జ‌రిగిన ఫ్రీడ‌మ్ ర్యాలీలో మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న పోలీసు తుపాకీని తీసుకుని గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ ఫొటోలు, వీడియోల‌ను చూసిన నెటిజ‌న్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జ‌రుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
Telangana
TRS
V Srinivas Goud
Mahaboob Nagar District
Greecdom Rally
SLR Weapon
Firing

More Telugu News