Sridevi: ‘అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం’.. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్న జాన్వి, ఖుషి

On sridevi birth anniversary daughters janhvi khushi share memories
  • తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన జాన్వి, ఖుషి
  • ఏరోజుకారోజు తనను మిస్సవుతున్నామంటూ కామెంట్
  • 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో కన్ను మూసిన శ్రీదేవి
  • ఆగస్టు 13న ఆమె 59వ జయంతి
అలనాటి అందాల తార శ్రీదేవి. తెలుగు మహిళే అయినా.. టాలీవుడ్, బాలీవుడ్ సహా మొత్తం ఏలిన నటి. ఆగస్టు 13న ఆమె జయంతి సందర్భంగా అభిమాన లోకం ఆమెను ఎంతో గుర్తు చేసుకుంది. ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు తల్లితో తమ అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిదంటూ నివాళి అర్పించారు.

హ్యాపీ బర్త్ డే అమ్మా..
శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి తల్లితో కలిసి తాను చిన్నప్పుడు దిగిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ‘‘హ్యాపీ బర్త్ డే అమ్మా. ఏ రోజుకారోజు నిన్ను మరింతగా మిస్సవుతూనే ఉన్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటా..” అని కామెంట్ పెట్టారు.

ఇక శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కొన్నేళ్ల కిందట తల్లితో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పెట్టారు. ఖుషీ బుగ్గపై శ్రీదేవి ముద్దు పెడుతుండగా తీసిన బ్లాక్ అండ్ వైట్ (మోనో క్రోమ్) ఫొటో ఇది.

59వ జయంతి ఇది..
  • శ్రీదేవి 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో గుండె పోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తన కుమార్తె జాన్విని హీరోయిన్ గా పరిచయం చేస్తూ నిర్మించిన ‘ధడక్’ సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు శ్రీదేవి కన్నుమూశారు. నేడు (ఆగస్టు 13) శ్రీదేవి 59వ జయంతి.
  • బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను శ్రీదేవి రెండో వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వి, ఖుషి ఇద్దరు పిల్లలు. బోనీ కపూర్ కు మొదటి భార్య మోనా శౌరీతో అర్జున్, అన్షులా కపూర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
  

Sridevi
Bollywood
Tollywood
India
Movie news
Janvi
Khushi
Instagram

More Telugu News