ధైర్యంగా ఉండండి... టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డికి హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ భ‌రోసా

10-08-2022 Wed 19:27
  • ఇటీవ‌లే ‌హ‌త్యాయ‌త్నం నుంచి తప్పించుకున్న జీవ‌న్ రెడ్డి
  • జీవ‌న్ రెడ్డిని ఆయ‌న ఇంటిలో ప‌రామర్శించిన మ‌హ‌మూద్ అలీ
  • నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ
ts home minister consoles trs mla jeevan reddy
సొంత పార్టీ నేత నుంచి ఎదురైన ‌హ‌త్యాయ‌త్నం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు టీఆర్ఎస్ నేత‌ల నుంచి ప‌రామ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధ‌వారం తెలంగాణ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ బాధిత ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ధైర్యంగా ఉండాలంటూ జీవ‌న్ రెడ్డికి మ‌హ‌మూద్ అలీ సూచించారు. హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డ నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. రాజ‌కీయాల్లో ఈ త‌ర‌హా కుట్ర‌లు దారుణ‌మ‌న్న అలీ... ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.