Telangana: బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వికి బెస్ట్ విషెస్ చెప్పిన కేటీఆర్‌

ktr congratulates bihar new deputy cm tejashwi yadav
  • నితీశ్ స‌ర్కారులో డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేసిన తేజ‌స్వి 
  • తేజ‌స్వికి అభినంద‌న‌లు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్‌
  • బీహార్ ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌ని ఆకాంక్ష‌
బీహార్‌లో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నేతృత్వంలో బుధ‌వారం కొత్త స‌ర్కారు కొలువు దీరిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన నితీశ్‌... కొత్త మంత్రివ‌ర్గ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం మ‌రోమారు తానే సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టిదాకా బీజేపీ పొత్తుతో సాగిన నితీశ్, కొత్త కేబినెట్‌ను మాత్రం ఆర్జేడీ స‌హా 7 కొత్త పార్టీల మ‌ద్ద‌తుతో స‌రికొత్త‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కేబినెట్‌లో ఆర్జేడీ అగ్ర‌నేత తేజ‌స్వి యాద‌వ్ డిప్యూటీ సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. 

ఈ క్రమంలో తేజ‌స్వికి తెలంగాణ‌లోని అధికార పార్టీ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. నూత‌నంగా డిప్యూటీ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తేజ‌స్వికి అభినంద‌న‌లు చెప్పిన కేటీఆర్‌... ఈ ప‌ద‌వితో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆయన మ‌రింత మేర మెరుగైన సేవలు అందిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని పేర్కొన్నారు.
Telangana
TRS
Bihar
Tejashwi Yadav
Deputy CM
RJD
JDU
Nitish Kumar

More Telugu News