బ్లాక్ మ్యాజిక్ ను నమ్ముకునేవాళ్లు ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ పొందలేరు: మోదీ

10-08-2022 Wed 19:12
  • ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసన గళం
  • ఆగస్టు 5న ఢిల్లీలో నల్ల దుస్తుల్లో ధర్నాలు
  • నిరాశా నిస్పృహలతోనే ఇదంతా చేస్తున్నారన్న మోదీ 
Modi responds on Congress party protests wearing black clothes
ఇటీవల కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నల్ల దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టడం తెలిసిందే. నల్ల దుస్తులు ధరించి రాహుల్ గాంధీ తదితర నేతలు ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బ్లాక్ మ్యాజిక్ ను నమ్ముకునేవాళ్లు ఎప్పటికీ ప్రజల నమ్మకాన్ని పొందలేరని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ నేతలు బ్లాక్ డ్రెస్సులు ధరించి ధర్నాలు చేపట్టడం పట్ల ఆయన మాట్లాడుతూ, "నిరాశా నిస్పృహల్లో మునిగిపోయిన కొందరు చేతగానితనంతో బ్లాక్ మ్యాజిక్ ను ఆశ్రయిస్తున్నారు. ఆగస్టు 5న కొందరు ఇలాగే బ్లాక్ మ్యాజిక్ ప్రచారం పొందడానికి ప్రయత్నించడం చూశాం. నల్ల దుస్తులు ధరిస్తే తమలోని నిరాశా నిస్పృహలు వీడిపోతాయని భావిస్తున్నారేమో" అని మోదీ వ్యాఖ్యానించారు.