కల్యాణ్ రామ్ అతిపెద్ద విజయాన్ని అందించాడు: దిల్ రాజు
- ఈ నెల 5వ తేదీన విడుదలైన 'బింబిసార'
- ప్రెస్ మీట్ ను నిర్వహించిన టీమ్
- ఇది పెద్ద విజయమన్న దిల్ రాజు
- కల్యాణ్ రామ్ అద్భుతంగా చేశాడంటూ ప్రశంస
అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందా అని అంతా చర్చలు జరుపుతున్న సమయంలో వచ్చిన 'బింబిసార' .. 'సీతా రామం' ఇండస్ట్రీకి కొత్త ఊపిరిపోశాయని చెప్పారు. ఇండస్ట్రీలో ఎవరి సినిమాలు హిట్ అవుతున్నా కళకళలాడుతూ ఉండటమే తమకి కావలసిందని అన్నారు. 'బింబిసార' పెద్ద విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
నిర్మాత పెట్టిన పెట్టుబడి .. ఆ ఖర్చును దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్ కి ఇవ్వడం .. ఆ డిస్ట్రిబ్యూటర్లు 3 రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లడం జరిగినప్పుడు అది పెద్ద విజయం క్రింద లెక్క అన్నారు. ఆ కొలమానాన్ని 'బింబిసార' అందుకుందనీ, అందువల్లనే పెద్ద విజయం అని చెప్పవలసి వచ్చిందని చెప్పారు. కల్యాణ్ రామ్ అదరగొట్టేశాడనీ.. తాను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటూ టీమ్ ను అభినందించారు.