Nnai: 'దసరా' సెట్స్ పై ప్రమాదం నుంచి తప్పించుకున్న హీరో నాని

  • దసరా చిత్రంలో నటిస్తున్న నాని
  • హైదరాబాద్ లో షూటింగ్
  • బొగ్గు గని సెట్ లో నానిపై సన్నివేశాల చిత్రీకరణ
  • నానిపై పడిన బొగ్గు లోడు
  • తీవ్ర ఆందోళనకు గురైన యూనిట్
Hero Nani escapes unhurt on Dasara sets

టాలీవుడ్ యువ హీరో నాని పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నాని నటిస్తున్న దసరా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇక్కడే భారీ బొగ్గు గని సెట్ వేశారు. అయితే, ఓ బొగ్గు లారీ కింద నాని నటించే సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, బొగ్గు లోడు మొత్తం ఒక్కసారి నానిపై పడింది. దాంతో సెట్స్ పై ఉన్న అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

అయితే నాని ఆ బొగ్గులోంచి క్షేమంగా బయటికి రావడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ ను కాసేపు నిలిపివేశారు. గాయాలేమీ కాకపోయినప్పటికీ, నాని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం నాని మళ్లీ షూటింగ్ కు సిద్ధం కావడంతో చిత్రబృందంలో ఉత్సాహం వెల్లివిరిసింది. 

దసరా చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News