రానున్న రోజుల్లో కష్టాల కడగండ్లు తప్పవు: పాక్ ఆర్థికమంత్రి హెచ్చరిక
- పాక్ లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం
- మరో మూడు నెలలు ఆంక్షలు తప్పవన్న ఆర్థికమంత్రి
- ఇమ్రాన్ ఫ్రభుత్వమే కారణమని ఆరోపణ
అంతకుముందు పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రభుత్వ హయాంలో బడ్జెట్ లోటు 1,600 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ లోటు ఒక్కసారిగా 3,500 బిలియన్ డాలర్లకు పెరిగిందని మిఫ్తా ఇస్మాయిల్ వివరించారు. ఇలాంటి ద్రవ్య ఖాతాల లోటుతో ఏ దేశం కూడా సుస్థిర అభివృద్ధి సాధించలేదని అభిప్రాయపడ్డారు.
సాధారణంగానే ఆర్థిక ఒడిదుడుకులతో ప్రస్థానం కొనసాగించే పాక్ ను కరోనా వ్యాప్తి తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా దెబ్బకు కుదేలైన దేశాల్లో పాక్ కూడా ఒకటి. కరోనా వైరస్ ను పాక్ దీటుగానే ఎదుర్కొన్నప్పటికీ, ఆ మహమ్మారి ప్రభావంతో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని పాక్ నియంత్రించలేకపోయింది.